అక్రమ గన్‌పై పోలీసుల కన్ను

29 Feb, 2016 15:57 IST|Sakshi

లెసైన్స్ లేని తుపాకిని కలిగున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండలం రామారెడ్డినగర్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని శంకర్ అనే వ్యక్తి అక్రమంగా తుపాకి కలిగి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో విచారణ చేసిన పోలీసులు తుపాకి ఎక్కడిదని అతన్ని ప్రశ్నించగా చాలా ఏళ్ల క్రితం రోడ్డుపై దొరికిందని, అప్పటినుంచి తన ఇంట్లో భూమిలోపల దాచిపెట్టినట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు