వారఫలాలు (16 ఫిబ్రవరి నుంచి 22 వరకు)

16 Feb, 2020 08:09 IST|Sakshi

 వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన  పనులు కొంత మందకొడిగా సాగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. అయితే అవసరాలకు లోటు ఉండదు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారధన మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు అవశాలు దక్కి  ఉత్సాహవంతంగా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.  వారం చివరిలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు చాలావరకూ  తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. మీ అంచనాలు నిజమయ్యే సమయం. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. ఇంటిలో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వ్యాపారులకు ఊహించని పురోగతి కనిపిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో  ధనవ్యయం. మిత్రులతో కలహాలు.  గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుతారు. బంధువులు, మిత్రులతో వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో ఒత్తిడులు ఎదురవుతాయి. తెలుపు, పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. ఇంటిలో వేడుకలు నిర్వహిస్తారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. తగినంత లాభాలు కూడా దక్కుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి పట్టింది బంగారమే అవుతుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగి మీ సహనాన్ని పరీక్షిస్తాయి.  సోదరులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. తగిన జాగ్రత్త అవసరం. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. విందువినోదాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. భూవివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా బాధ్యతలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక విషయాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ప్రముఖుల  నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్ణయాలను సకాలంలో తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీలో దాగిన నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత సహకరించకపోయినా లెక్కచేయరు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. విద్యార్థుల దీర్ఘకాలిక కల ఫలిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలు విస్తరించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి మిముక్తి లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమ తప్పదు. బంధువులతో విభేదాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు.  దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోతాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు