బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు

26 May, 2017 03:17 IST|Sakshi
బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు
వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం: మంత్రి జోగు రామన్న 
 
సాక్షి, హైదరాబాద్‌: బీసీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 2017–18 వార్షిక సంవ త్సరంలో ఇచ్చే రుణాలపై రూ.102 కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తుందని, ఈ ప్రక్రియ ముగిసిన వెం టనే క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడ తామన్నారు. గురువారం బీసీ సంక్షేమ భవన్‌లో ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 119 గురు కుల పాఠశాలలు ప్రారం భిస్తున్నట్లు తెలిపారు.

గురుకులాలు అన్ని సౌకర్యా లతో శాశ్వత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను గుర్తించామని, విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. గతంలో హాస్టల్‌ విద్యార్థులకు నెలకు 4 సార్లు మాంసాహారాన్ని అందించగా, ప్రస్తుతం 7 సార్లు ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. బీసీ విదేశీ విద్యా నిధి పథకం కింద త్వరలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుందని, అధికారులు సకాలంలో నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్, అదనపు కార్యదర్శి సైదా, కమిషనర్‌ అరుణ, జేడీలు అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్యభట్టు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు