3016 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ

21 May, 2016 02:23 IST|Sakshi
3016 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ

గుర్తింపు సంఘంతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ఏపీఎస్‌ఆర్టీసీలో 3016 మంది కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులరైజ్ చేసేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోను అమలు చేసేందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2014 డిసెంబర్ 31 ముందు జాయిన్ అయి సర్వీసులో ఉన్న 2261 మంది డ్రైవర్లు, 755 మంది కండక్టర్లను ఈ నెల 1 నుంచి రెగ్యులర్ కార్మికులుగా పరిగణించనున్నారు.

కార్మికులకు రావాల్సిన కరువు భత్యం(డీఏ) మూడు నెలల బకాయిలను జూన్ 1న జీతంతోపాటు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. టెంపరరీ ట్రాన్స్‌ఫర్‌లో ఉన్న కార్మికులందరికీ ఇంకొక ఏడాది పాటు అవకాశం ఇస్తూ గడువు పొడిగించేలా ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆసరా ఇచ్చేలా వారి పిల్లలకు ఉద్యోగం కల్పించే దిశగా సర్వీసు నిబంధనలు మార్పు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది.

మరిన్ని వార్తలు