'231 కరవు మండలాలను మాత్రమే గుర్తించింది'

30 Mar, 2016 10:19 IST|Sakshi

హైదరాబాద్ : గతేడాది సెప్టెంబర్లోపే రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించి ఉంటే బావుండేదని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా టి.జీవన్రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 433 కరువు మండలాలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 231 కరవు మండలాలను మాత్రమే గుర్తించిందని ఆయన చెప్పారు. సరైన సమయంలో కరువు మండలాలను గుర్తిస్తే కేంద్రం సాయం పొందే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి టి.జీవన్రెడ్డి సూచించారు.

మరిన్ని వార్తలు