జీతాలు పెంచమన్న పాపానికి..

24 Dec, 2015 17:41 IST|Sakshi

హైదరాబాద్: తమ జీతాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. వేలసంఖ్యలో అంగన్వాడీ వర్కర్లను తొలగించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించిన అంగన్ వాడీ కార్యకర్తల వీడియోలను జిల్లా సీడీపీవోలకు పంపినట్లు సమాచారం.

అంగన్‌వాడీల తొలగింపు ఉత్తర్వుల్లో వారిని ఎందుకు తొలగిస్తున్నారో తెలుపుతూ సెక్షన్లు కూడా పేర్కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క కృష్ణా జిల్లా నుంచే 2,500 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి నేడో రేపో తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

ప్రభుత్వ కఠిన వైఖరిపై అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాలు పెంచమన్నందుకు ప్రభుత్వం తమ ఉద్యోగాలనే పీకేయడం ఎంతవరకు సబబని వారు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు