అంజన్ కుమారుడు అనిల్ అరెస్టు.. విడుదల

18 Dec, 2014 19:16 IST|Sakshi
అంజన్ కుమారుడు అనిల్ అరెస్టు.. విడుదల

సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వివాదం కేసులో ఆయనను నల్లకుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ మీద విడిచిపెట్టారు. బుధవారం సాయంత్రం అడిక్మెట్ ప్రాంతంలో అయ్యప్ప పూజకు అనిల్ కుమార్ యాదవ్, మరికొందరు కలిసి వెళ్లారు. అదే సమయంలో అడిక్మెట్ ప్రాంతానికి చెందిన విజయకుమార్ యాదవ్, అతడి మామ శ్రీనివాసయాదవ్ మరికొందరు మద్యం తాగి వచ్చారు. పూజ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో శ్రీనివాసయాదవ్ తదితరులను అనిల్ కుమార్ యాదవ్ కొట్టినట్లు సమాచారం.

అయితే, రాబోయే జనవరిలో జరిగే యూత్ కాంగ్రెస్ ఎన్నికల గురించి మాట్లాడేందుకు వెళ్లగా తమను అనిల్ యాదవ్ కొట్టినట్లు శ్రీనివాస యాదవ్, విజయ్ కుమార్ యాదవ్ తదితరులు ఆరోపించారు. అది సరికాదని, పూజకు వచ్చిన వాళ్లు తాగి గొడవపడ్డారని అనిల్ యాదవ్ అన్నారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో ఇద్దరి మీద కేసులు పెట్టిన పోలీసులు.. ఆ తర్వాత వారు రాజీ పడటంతో స్టేషన్ బెయిల్ మీద విడిచిపెట్టారు. అనిల్ కుమార్ యాదవ్పై ఐపీసీ సెక్షన్లు 324, 328 కింద కేసులు పెట్టగా, విజయ్ కుమార్ యాదవ్ తదితరులపై 324, 327, 34 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు