కత్రినా షేక్.. బిపాసా హాట్..

21 Aug, 2014 00:14 IST|Sakshi
కత్రినా షేక్.. బిపాసా హాట్..

 సిటీలో కాఫీలు, ఐస్‌క్రీమ్స్‌కు ఎలా రెగ్యులర్ బడ్డీస్ ఉన్నారో... మిల్క్‌షేక్‌లకూ అంతే ఉన్నారు. రెస్టారెంట్స్‌లో మెనూ  తీసుకోగానే మిల్క్‌షేక్స్ ఏం ఉన్నాయా అని సెర్చ్  చేసేవారెందరో. అలాంటి మిల్క్‌షేక్ మేనియా ఉన్నవారి కోసం మాదాపూర్, శిల్పారామంలోని ఓరిస్ ఈట్‌మోర్  రెస్టారెంట్ సరికొత్త మెనూని సిద్ధం చేసింది. కత్రినా మ్యాంగో, హాట్ బడ్జ్ బిపాసా అంటూ బాలీవుడ్  సెలబ్రిటీల పేర్లతో ఊరిస్తోంది.

‘‘
పేర్లు మాత్రమే కాదు టేస్ట్‌లోనూ మా మిల్క్‌షేక్స్ స్పెషల్’’ అని రెస్టారెంట్ మేనేజర్ హరి చెప్పారు. బ్లూ బియాన్స్, బెల్జియం చాక్లెట్ వంటి దాదాపు 8 రకాల మిల్క్‌షేక్స్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. తమవి కేవలం మిల్క్ షేక్స్ మాత్రమే కావని ఇవి ‘థిక్ షేక్స్’ అని చెబుతున్న ఈ రెస్టారెంట్ ప్రతినిధులు... ఐస్‌క్రీమ్‌ని ఫుల్‌గా  దట్టించిన వెరైటీలివని అంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు