ఫ్యాషన్ పాఠాలు | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ పాఠాలు

Published Thu, Aug 21 2014 12:09 AM

ఫ్యాషన్ పాఠాలు

నగరానికి చెందిన లఖోటియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులకు ముంబై ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జేమ్స్ ఫెరిరా పాఠాలు చెప్పారు. మొన్నటి అమితాబ్, షబానా ఆజ్మీల దగ్గర్నుంచి నేటి ఆమిర్‌ఖాన్, ఫ్రిదా పింటోల దాకా తరాల మధ్య వారధిగా నిలిచిన జేమ్స్... డిజైనర్‌గా సుదీర్ఘకాలం రాణించేందుకు అవసరమైన మెళకువలను నేర్పించారు.

ఆధునికతను ఒడిసిపట్టుకుంటూనే గత కాలపు వస్త్రధారణలోని వైవిధ్యాన్ని ఆకళింపు చేసుకోవడం డిజైనర్లకు అవసరమని ఆయన సూచించారు. జేమ్స్ తవు విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై లఖోటియా నిర్వాహకులు ఆయేషా, అజహర్ సంతోషం వ్యక్తం చేశారు.
 
 
 

Advertisement
Advertisement