రైలు దోపిడీపై ప్రయాణికుల ఫిర్యాదు

1 Apr, 2014 08:58 IST|Sakshi

హైదరాబాద్ : చెన్నై ఎక్స్ప్రెస్ రైలు దోడిపీపై ప్రయాణికులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇకనైనా రైళ్లల్లో భద్రత పెంచాలని వారు డిమాండ్ చేశారు. కాగా అసలే అర్థరాత్రి రెండున్నర  .. రైల్లో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అంతే ఒక్కసారిగా దొంగలు విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా నడికుడి వద్ద చెన్నై హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు చైను లాగి మరీ బీభత్సం సృష్టించారు. S-11, S-12 బోగీల ప్రయాణికులను బెదిరించి నగలు, నగదు దోచుకున్నారు.

వ్యూహం ప్రకారం రెక్కి నిర్వహించిన దొంగలు, పిడుగురాళ్లలో జీఆర్పీ పోలీసులు దిగిపోయిన కాసేపటికే రంగంలోకి దిగారు. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. కత్తులతో బెదిరించిన దొంగలు, దాదాపు అందరి దగ్గర ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడం, రైళ్లల్లో భద్రత కరువవ్వడమే చోరీకి కారణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్లగా టిసి సహకరించలేదని, కనీసం రైల్వే హెల్ప్‌లైన్‌ కూడా పనిచేయలేదని వారు ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు