నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు

29 May, 2016 22:24 IST|Sakshi

- నగర మేయర్ బొంతు రామ్మోహన్
చిక్కడపల్లి: నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనుకాడేదిలేదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌జీవోస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో యాచకులు లేని నగరంగా హైదరాబాద్‌ను చీర్చిదిద్దాలని ఫ్లకార్డు, బ్యానర్లు పట్టుకొని ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నిజమైన యాచకులకు ఉపాధి కల్పించి, వారి జీవన స్థితిగతులను మెరుగు పర్చేందుకు కృషిచేస్తామని తెలిపారు.

నగరంలో 10వేల మంది బిచ్చగాళ్లు ఉండగా కేవలం 400మంది మాత్రమే నిజమైన యాచకులుగా సర్వేలో తేలిందని, నకిలీలంతా నగరాన్ని వదిలిపెట్టి వెళ్లకపోతే కేసులు తప్పవన్నారు. కార్యక్రమంలో స్థానిక గాంధీనగర్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్లు ముఠా పద్మ, హేమలత, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యక్రమ నిర్వాహక సంస్థ వ్యవస్థాపకులు శంకర్‌నారాయణ, చైర్మన్ జి.రామయ్య, నిర్వాహక కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు