ఉల్లిక్కిపడ్డ ‘జైన్ శిల్ప’ అపార్ట్‌మెంట్

5 Jul, 2016 23:26 IST|Sakshi
ఉల్లిక్కిపడ్డ ‘జైన్ శిల్ప’ అపార్ట్‌మెంట్

సింథియా దారుణ హత్య, కాల్చివేతతో విషాదం
రూపేష్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు...
సింథియా ఇంటికే పరితమయ్యేది: స్థానికులు
 


గచ్చిబౌలి: రూపేష్ కుమార్ తన భార్య సింథియాను హత్య చేసి, శరీర భాగాలను కాల్చిశాడని తెలిసి గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ అపార్ట్‌మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. అయ్యో పాపం... అంటూ కన్నీరుపెట్టుకున్నారు.  శంషాబాద్‌లోని మదనపల్లిలో భార్య శరీర భాగాలను కాల్చివేసి పట్టుబడిన రూపేష్.. అపార్ట్‌మెంట్‌లో ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని అక్కడి వారు తెలిపారు. జైన్ శిల్ప అపార్ట్‌మెంట్‌లో రమణరావుకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని జి- ఫ్లాట్‌లో రూపేష్ కుమార్ రెండేళ్లుగా అద్దెకుంటున్నాడు.  భార్య సింథియా, కూతురు సానియాతో పాటు నగరంలో బీటెక్ చదువుతున్న బావమరిది (సింథియా సోదరుడు) ఫ్లాట్‌లో ఉంటున్నారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే రూపేష్ రోజూ ఉదయం 10 గంటల బయటకు వెళ్లి సాయంత్రం 7 గంటలకు  తిరిగి వచ్చేవాడు.  ఆదివారం ఉదయం ఫంక్షన్‌కు వెళ్లిన రూపేష్, సింథియా, సానియా తిరిగి రాగా.. సింథియా సోదరుడు స్నేహితుల వద్దకు వెళ్లాడు. సోదరి హత్య విషయం తెలియని అతను  సోమవారం రాత్రి  12 గంటలకు ఫ్లాట్‌కు వచ్చాడు. తాళం చెవి లేకపోవడంతో అపార్ట్‌మెంట్‌లోనే తచ్చాడాడు. మీడియా హుడావుడి చూసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూపేష్, సింథియా గొడవపడ్డట్టు తాము ఎప్పుడు గమనించలేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. సింథియా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేది కాదని, రూపేష్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని తెలిపారు. సింథియా సోదరుడే ఇంటి పనులు చేసేవాడ న్నారు.
 

గుట్టుచప్పుడు కాకుండా హత్య
భార్యను హత్య చేసి ముక్కలు చేసిన అనంతరం శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్ నుంచి కారులో తీసుకెళ్లి ఉంటాడని అపార్ట్‌మెంట్ వాసులు భావిస్తున్నారు. రూపేష్ ఫ్లాట్ పక్కన్నే లిఫ్ట్ ఉంది. కారు లిఫ్ట్ దగ్గరికి వచ్చే వీలుంది. కూతురుకు చెత్త అని చెప్పి ఆమె సహాయంతోనే సూట్‌కేస్‌ను కారులో పెట్టుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కారులో ఏ సమయంలో బయటకు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది.
 

మరిన్ని వార్తలు