ప్రతి కళాశాల ప్రమాణాలు పాటించాల్సిందే

21 Jan, 2018 01:48 IST|Sakshi

జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ వేణుగోపాల్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాల్సిందేనని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలాజికల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జేఎన్టీయూహెచ్‌ ఆడిటోరియంలో కళాశాల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్‌ హాజరు విధానం తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు.

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు పొందాలంటే గత మూడేళ్లుగా 25 శాతానికి పైగా అడ్మిషన్లు ఉండాలని, ఉత్తీర్ణత శాతం కూడా మెరుగైన రీతిలో ఉండాలని స్పష్టం చేశారు. కళాశాలల్లో కనీస వసతులు ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. అయితే అనుబంధ గుర్తింపునకు గత మూడేళ్ల ప్రవేశాలకు బదులుగా ఇప్పటినుంచి మూడేళ్ల ప్రవేశాల తీరును పరిగణలోకి తీసుకోవాలని పలు కాలేజీల యాజమాన్యాలు సూచించినట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపునకు, ఉత్తీర్ణతకు ముడిపెట్టొదని యాజమాన్యాలు కోరినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు