బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

9 May, 2017 11:06 IST|Sakshi
బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12 లోని ఒక అపార్టుమెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అపార్టుమెంట్‌లోని 5 వ అంతస్తులో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్టు సర‍్క‍్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని అంటున్నారు. మూడు అగ్నిమాపకయంత్రాలు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరిన్ని వార్తలు