ఉద్యోగ దంపతుల సౌకర్యార్థం బదిలీలు

21 May, 2016 17:49 IST|Sakshi

హైదరాబాద్: ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న భార్యభర్తలకు వారి సౌకర్యార్థం... బదిలీలు చేయనున్నారు. భార్యభర్తలిద్దరూ తమ కుటుంబాలకు దగ్గరలోని ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వీలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ కేంద్ర  ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న భార్యభర్తలు ఉద్యోగరీత్యా కుటుంబాలకు దూరంగా పనిచేయాలసి వచ్చేది. ప్రభుత్వ ఉద్యోగులిద్దరూ భార్యభర్తలు కావడంతో భర్త ఒకచోట, భార్య మరోప్రాంతంలో సంస్థలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ వారి కుటుంబాలకు దూరంగా ఉండవలసి రావడంతో నివాసానికి, పనిచేసే సంస్థలకు వెళ్లిరావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యపై పూర్తిస్థాయిలో పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులైన భార్యభర్తల సౌకర్యార్థం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలోని సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఈ తాజా ఉత్తర్వులు వర్తించవు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసే క్రమంలో ప్రభుత్వ సంస్థలలో సీనియారిటీ హోదా ప్రకారంగా ఆయా ప్రభుత్వ సంస్థలలో పోస్టింగ్‌ ఇవ్వబడుతుంది.

మరిన్ని వార్తలు