మహా బడ్జెట్

17 Nov, 2016 23:57 IST|Sakshi
మహా బడ్జెట్

 రూ.5643 కోట్లు!   స్టాండింగ్ కమిటీ ముందుకు ముసారుుదా
24న కమిటీలో చర్చించాక ఆమోదం

సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ సిద్ధమరుుంది. గురువారం 2017-18 సంవత్సరానికి రూ.5643 కోట్లతో ముసారుుదా బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుంచారు. దీనిపై అధ్యయనం చేసి.. ఈనెల 24న జరిగే సమావేశంలో చర్చించాక ఆమోదం తెలపనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడు సైతం బడ్జెట్‌ను భారీ గా ప్రతిపాదించారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సైతం రూ.5600 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, వాస్తవంగా  అది అమలయ్యే పరిస్థితి లేదు. మొదటి ఆరుమాసాలకు సుమారు రూ.1300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా మిగిలి ఉన్న కాలంలో మరో రూ.1700 కోట్లు ఖర్చు చేసినా మొత్తం రూ. 3,000 కోట్లు దాటే పరిస్థితి లేదు. 2015-16లో సైతం రూ. 5600 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినా రూ.3034 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. బడ్జెట్‌లో పేర్కొన్న ఆదాయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను, ఇతరత్రా ఫీజులు వెరసి రూ.2,768 కోట్లు అంచనా వేసినప్పటికీ, తొలి ఆరునెలల్లో రూ.889 కోట్లు మాత్రమే వచ్చారుు.

ట్రేడ్ లెసైన్సుల ఫీజులు, ప్రకటనల పన్నులు, భవననిర్మాణ అనుమతులు వాటిద్వారా రూ.926 కోట్లు అంచనా వేసినప్పటికీ, రూ.300 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో ఆస్తిపన్ను, ఇతర ఫీజుల రూపంలో పదిరోజుల్లోనే దాదాపు రూ.200 కోట్ల మేర వసూలైంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చినెలలో వసూలయ్యే మొత్తాలే ఇప్పుడు వసూలైనట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలా ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలో ఎక్కువ వసూళ్లు ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల వాటాలు రూ.3630 కోట్లు అంచనా వేయగా, సెప్టెంబర్ వరకు రూ.75 కోట్లు మాత్రమే వచ్చారుు. ఈ నేపథ్యంలో ఏటికేడు బడ్జెట్ పెంచుతూ పోతున్నప్పటికీ, అది కాగితాల్లో తప్ప వాస్తవంగా అమలు కావడం లేదు. ముసారుుదా  ప్రతిపాదనల మేరకు బడ్జెట్, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్, ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం, ఖర్చుల పరిస్థితి వివరాలిలా ఉన్నారుు.

బాండ్ల ద్వారా రూ. 887 కోట్లు..
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18) రూ.887 కోట్లు జీహెచ్‌ఎంసీ బాండ్ల ద్వారా సేకరించాలని ప్రతిపాదించారు. ఇందుకు త్వరలో బాండ్లు జారీ చేయనున్నారు. ఎస్సార్‌డీపీ (స్ట్రాటెజిక్  రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్)లో భాగంగా స్కైవేలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు తదితర పనులకు వీటిని వినియోగించేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు