హైదరాబాద్ కలెక్టర్‌గా నిర్మల

13 Jan, 2015 00:35 IST|Sakshi
హైదరాబాద్ కలెక్టర్‌గా నిర్మల

సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కె.నిర్మల సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా 18 మాసాలకుపైగా పని చేసిన ముఖేష్‌కుమార్ మీనా ఐఏఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లారు. హైదరాబాద్ ఏపీఎండీపీలో ైడెరైక్టర్‌గా పనిచేస్తున్న నిర్మలను జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాత్రి  ఉత్తర్వులు జారీ చేయటంతో సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా ఇన్‌చార్జి జేసీ సంజీవయ్య, డీఆర్‌ఓ అశోక్‌కుమార్‌తో సహా ఆర్డీఓలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు , కలెక్టరేట్ ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియచేశౠరు. ఇక ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ పోస్టును ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. ఖమ్మం జిల్లా జేసీగా పనిచేస్తున్న సురేంద్ర మోహన్‌ను హైదరాబాద్ జేసీగా బదిలీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లా  ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

ప్రజా ఫిర్యాదులకు పెద్ద పీట: కలెక్టర్ నిర్మల

ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కె.నిర్మల తెలిపారు. బాధ్యతలు స్వీరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు  పేదలకు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. భూముల పరిరక్షణ, ఇళ్ల క్రమబద్ధీకరణ, ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారిస్తామన్నారు.
 
ప్రొఫైల్...
 
స్వస్థలం: మహబూబ్‌నగర్ జిల్లా
ఏ బ్యాచ్: 2005 ఐఏఎస్ బ్యాచ్
గతానుభవం: 1995 నుంచి 1999 వరకు కర్నూల్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆర్డీఓగా పని చేశారు.
1999 నుంచి 2002 వరకు మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా, డీఆర్‌డీఏ పీడీగా బాధ్యతలు.
2003లో వరంగల్ జిల్లా వెలుగు పీడీ. 2004-09 వరకు హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి శాఖలో జాయింట్ కమిషనషర్‌గా, 2010 నుంచి 2011 వరకు పాడేరు ఐటీడీఏ పీడీగా పని చేశారు.  2011 నుంచి 2014 ఫిబ్రవరి వరకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఆ తర్వాత 10 మాసాలు హైదరాబాద్‌లో ఏపీఎండీపీలో డెరైక్టర్‌గా నిర్మల  పని చేశారు.
 

మరిన్ని వార్తలు