'అలాంటి వీడియో ఓ తండ్రిగా చూడలేను'

10 May, 2015 12:03 IST|Sakshi
'అలాంటి వీడియో ఓ తండ్రిగా చూడలేను'

హైదరాబాద్: తన కొడుకుపై పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోను ఓ తండ్రి స్థానంలో ఉండి తాను చూడలేనని నబిల్ తండ్రి యూసుఫ్ అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో నబిల్ అతడి స్నేహితుడి మధ్య బాక్సింగ్ ఫైటింగ్ జరిగి నబిల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నబిల్ తల్లిదండ్రులు స్పందించి నబిల్ చనిపోయిన అనంతరం తమకు బైక్ యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పారని అన్నారు.

ఇంట్లో ఉన్నవాడిని ఏ విషయం చెప్పకుండా తీసుకెళ్లారని, ఒక్కగానొక్క బిడ్డను పొట్టన పెట్టుకున్నారని చెప్పారు. ఇప్పటికే దానికి సంబంధించిన వీడియో మీరంతా చూశారని, కొడుకు చనిపోయే వీడియోను ఒక తండ్రిగా తాను మాత్రం చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిందితులనకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు