రైల్వేలో సమ్మె సైరన్‌

9 Jun, 2016 19:31 IST|Sakshi

 కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు జులై 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సమ్మె నోటీసును సికిం‍ద్రాబాద్‌ రైల్‌ నిలయంలోని దక్షిణ మధ్యరైల్వే జీఎం రవీందర్‌కు కార్మిక నేతలు గురువారం సమ్మె నోటీసును అందజేశారు.

 

రైల్వే కార్మిక సంఘం నేత రాఘవయ్య నేతృత్వంలో సికిం‍ద్రాబాద్‌ నుంచి భారీ ర్యాలీతో వచ్చి సమ్మె నోటీసు అందజేశారు. కొత్త పెన్షన్‌ విధానం, బిబేక్‌ దెబ్రయ్‌ కమిటీ రద్దుతోపాటు, ఖాళీ ఉద్యోగా లభర్తీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మెనోటీసు ఇచ్చిన రాఘవయ్య తెలిపారు. జులై 11లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు