జూరాల నుంచి భీమాకు నీటి విడుదల

19 Jan, 2018 01:11 IST|Sakshi

అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: జూరాల నుండి భీమా రెండో దశకు నీరు విడుదల చేయడానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. గురువారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 15వేల ఎకరాల పంటకు ఆఖరు తడికోసం నీటిని ఇవ్వాలన్న మంత్రి జూపల్లి సూచన మేరకు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

మూడు రోజులపాటు నీటిని విడుదల చేయనున్నారు.  సమావేశంలో జూపల్లితో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ ఖదేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు