జస్టిస్‌ నాగార్జునరెడ్డికి పితృవియోగం

25 Feb, 2017 01:16 IST|Sakshi
జస్టిస్‌ నాగార్జునరెడ్డికి పితృవియోగం

సాక్షి, హైదరాబాద్‌/వీరబల్లి (రాజంపేట): ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి తండ్రి సి.శ్రీరాములురెడ్డి (97) గురువారం రాత్రి మరణించారు. వయోభారం కారణంగా గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైఎస్సార్‌ జిల్లా కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన వీరబల్లి మండలం గడికోట గ్రామం యడబల్లికి తీసుకొచ్చారు. శ్రీరాములురెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి కాగా, చిన్న కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి రాయచోటిలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డిలు యడబల్లికి చేరుకుని శ్రీరాములురెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. నాగార్జునరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించారు.శనివారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు జస్టిస్‌ నాగార్జునరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు