శృంగేరి మఠానికి కేసీఆర్..

15 Dec, 2015 17:26 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం కర్ణాటకలోని శృంగేరీ మఠానికి వెళ్లనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో మంగుళూరు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో శృంగేరి మఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ విదుశేఖర శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థస్వామిని కేసీఆర్ కలుస్తారు. ఈ సందర్భంగా  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అయుత చండీయాగ ఆహ్వాన పత్రికను భారతి తీర్థస్వామికి అందచేసి యాగానికి ఆహ్వానించనున్నారు. అక్కడ నుంచి మూడు గంటలకు బయల్దేరి సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ను కూడా కేసీఆర్ ...చండీయాగానికి ఆహ్వానించారు. ప్రస్తుతం షిల్లాంగ్లో ఉన్న ఆయనతో కేసీఆర్ ఇవాళ సాయంత్రం వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. కేసీఆర్ ఆహ్వానానికి రవిశంకర్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే కేసీఆర్... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు ప్రముఖులను యాగానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు