కిడ్నీని మింగిన బైక్ రేసింగ్!

15 Oct, 2016 08:30 IST|Sakshi
కిడ్నీని మింగిన బైక్ రేసింగ్!

- కింద పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు
- ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాటం

 
 హైదరాబాద్: భాగ్యనగరంలో మైనర్ల డ్రంకన్ డ్రైవ్‌కు, బైక్ రేసింగ్‌లకు చెక్ పడడం లేదు. రమ్య, సంజన ఉదంతాలు మరవక ముందే తాజాగా జరిగిన మరో ఘటనలో ఓ యువకుడు కిడ్నీ పోగొట్టుకొని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పుట్టిన రోజు పార్టీలో మద్యం తాగి, ఆ తర్వాత బైక్ రేసింగ్ చేస్తూ ఈ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. వివరాలివీ.. ఆర్‌కే పురంలో నివసించే వంశీ(18) తన జన్మదినం సందర్భంగా ఈ నెల 10న అర్ధరాత్రి తన మిత్రులతో కలసి విందు చేసుకున్నాడు. కొత్తపేటకు చెందిన రేవంత్(16), నవాజ్ సహా మరో పది మంది మిత్రులతో నెక్లెస్ రోడ్‌లో కేక్ కట్ చేసి అనంతరం మద్యం సేవించారు.

తర్వాత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. వాహనాలపై వేగంగా దూసుకుపోతున్న క్రమంలో నవాజ్ వాహనం అదుపు తప్పి పడిపోయింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న రేవంత్ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తు తం రేవంత్ పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అతడి కిడ్నీని తొలగించారు. మైనర్లకు మద్యం సరఫరా చేసిన షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలం టూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన రేవంత్ తండ్రి సుభాష్ చంద్రబోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్లు బైక్ రేసింగ్‌కు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు