‘ముజీ’ స్టోర్‌ ఏర్పాటు చేయండి..

24 Jan, 2017 03:46 IST|Sakshi
‘ముజీ’ స్టోర్‌ ఏర్పాటు చేయండి..

జపనీస్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం
జైకా, జెట్రోలతోనూ సంప్రదింపులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రిటైల్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాలని జపనీస్‌ రిటైల్‌ మార్కెట్‌ రంగ దిగ్గజం ముజీ కంపెనీని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు ఆహ్వానించారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడ ముజీ కంపెనీ డైరెక్టర్, జనరల్‌ మేనేజర్‌ సటోషీ షిముజుతో సమావేశమై చర్చలు జరిపారు. హైదరాబాద్‌ నగరంలో వాల్‌మార్ట్‌ తరహా రిటైల్‌ కంపెనీలు తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేశాయని మంత్రి వివరిం చారు.

స్థానిక ఉత్పత్తులను ఎలాంటి బ్రాండ్‌ లేకుండా విక్రయించడం ముజీ ప్రత్యేకతని, ఇలాంటి సంస్థ రాష్ట్రానికి వస్తే స్థానిక ఉత్పత్తులను విక్రయించే అవకాశం లభిస్తుం దన్నారు. అనంతరం జైకా సీనియర్‌ ఉపాధ్య క్షుడు హిడెటోషి ఇరిగాకి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. జైకా రుణ సహకారం తో రాష్ట్రంలో అవుటర్‌ రింగ్‌ రోడ్డు వంటి ప్రాజెక్టులు నిర్మించారని మంత్రి గుర్తు చేశా రు. ప్రాజెక్టుల వారీగా ప్రతిపాదనలు అం దించాలని, రాష్ట్రానికి మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జైకా అధికారులు మంత్రికి తెలియ జేశారు.

మరిన్ని వార్తలు