దళితులను అణగదొక్కుతున్న ప్రభుత్వం

15 Apr, 2016 02:42 IST|Sakshi

పీసీసీ నేతల విమర్శ

 సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు నెరవేర్చకుండా రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు దళితులను అణగదొక్కే కుట్రలు చేస్తున్నాయని పీసీసీ నేతలు విమర్శించారు. ఇందిర భవన్‌లో గురువారం అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, సాకే శైలజానాథ్, సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, శాంతిభూషణ్ తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదంతా అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనే ఉద్దేశంతో ఆయన జన్మస్థలంలో రాహుల్ గాంధీ గతేడాది జూన్ 2న ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కుల, మత అసహనాలను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. బీజేపీ, టీడీపీలు దళిత, గిరిజన, బలహీన వర్గాల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు.

మరిన్ని వార్తలు