మావోల కట్టడికి పద్మవ్యూహం

10 May, 2017 02:14 IST|Sakshi
మావోల కట్టడికి పద్మవ్యూహం

పోలీస్‌ శాఖ భారీ కసరత్తు
- 10 కంపెనీల బలగాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి
- భారీగా నిధులు కేటాయించాలని విన్నపం
- మిగతా రాష్ట్రాలను నడిపించే దిశగా కార్యాచరణ


సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టుల నియంత్రణకు రాష్ట్ర పోలీస్‌ శాఖ భారీ కసరత్తు చేస్తోంది. మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదంటూనే కేంద్ర హోంశాఖ ముందు పెద్ద డిమాండ్లనే  ఉంచినట్టు తెలిసింది. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో చాప కింద నీరులా మావోయిస్టు కార్యకలా పాలు విస్తృతమవుతున్నట్టు రాష్ట్ర పోలీస్‌ శాఖ సోమవారం కేంద్ర హోంశాఖ నేతృ త్వంలో జరిగిన సమావేశంలో స్పష్టం చేసిం ది. ఇటీవలి ఛత్తీస్‌గఢ్‌ ఘటన తర్వాత రాష్ట్రం లో కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు మావోయిస్టు పార్టీ కసరత్తు చేస్తోందన్న సమాచారంతో.. పెద్దఎత్తున నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు పలు ప్రతిపాదనలు ఇచ్చి నట్టు తెలుస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో ఆపరేషన్స్‌ కొనసాగిస్తూనే మరో వైపు మిగతా రాష్ట్రాల్లోనూ మావోల కార్య కలాపాలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ పద్మవ్యూహాన్ని రచిస్తోంది.

మావో ప్రభావిత జిల్లాల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పోలీస్‌ శాఖ కేంద్ర హోంశాఖ సమావేశంలో ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చింది. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రతీ జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో కార్యాచరణ ప్రణాళిక రూపొం దించుకోవాలని ప్రజంటేషన్‌లో తెలిపారు. ఒక్కో మావోయిస్టు ప్రభావిత జిల్లాకు రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. మావోల ప్రభావం ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వైపు కూంబింగ్‌ నిర్వహించేందుకు 10 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు (సుమారు 1,400 సిబ్బంది) కావాలని కోరినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఆ మేరకు బలగాలను మోహ రించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ ఈ భేటీలో తెలిపారు. మరోవైపు మావోయిస్టుల దాడులు, వ్యూహాలను ఎదుర్కొనేందుకు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి శిక్షణ రాష్ట్ర పోలీసులు శిక్షణ ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు