ఇజ్రాయెల్‌ X పాలస్తీనా యుద్ధం.. ఈ చిన్నారి చేసిన పని చూస్తే ముచ్చటేస్తుంది

2 Nov, 2023 16:08 IST|Sakshi

పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అక్టోబర్‌ 7న గాజా స్ట్రిప్‌ నుంచి చొరబడిన హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్‌ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది.

ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 8,525వేల మంది పాలస్తీనియన్లు బలయ్యారు. ఈ నేపథ్యంలో దాడులను ఆపివేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తున్నాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. అయితే ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ పునరుద్ఘాటించారు.

కాల్పులు ఆపడమంటే హమాస్‌ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్‌, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక ఇజ్రాయెల్‌-పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర యుద్దం నేపథ్యంలో వర్తక, వాణిజ్యాల్లో కుదుపులకు కారణమవుతోంది. ఈ క్రమంలో పాలస్తీనియన్ల కోసం భారీగా నిధులు సమకూరుతున్నాయి. సిరియాలోని ఓ మసీదులో పాలస్తీయన్ల కోసం పలువురు విరాళాలు ఇస్తుండగా, ఓ చిన్నారి సైతం తనకు తోచినంత సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 

మరిన్ని వార్తలు