తొలిరోజు కొత్త నోట్లు సెల్ఫీలకే పరిమితం

11 Nov, 2016 00:35 IST|Sakshi
కొత్త నోటుతో సెల్ఫీ దిగుతున్న యువతులు

రూ.2000కు దొరకని చిల్లర
మార్చుకోలేక ఇబ్బందిపడ్డ జనం
తొలిరోజు కొత్త నోట్లు సెల్ఫీలకే పరిమితం
నేటి నుంచి పనిచేయనున్న ఏటీఎంలు

సిటీబ్యూరో: రెండురోజులుగా ‘చిల్లర’ కష్టాలు పడుతున్న నగర జీవికి మరో ‘కొత్త’ కష్టం వచ్చిపడింది. గురువారం కొత్త కరెన్సీ కోసం ఉదయమే బ్యాంకులకు పరుగులు తీసి.. ఆశగా సరికొత్త రూ.2000 నోట్లు అందుకున్నారు. వెంటనే సెల్ఫీలు దిగారు. ఆనందంగా వాటిని మార్చుకోవాలని ప్రయత్నించగా అసలు కష్టం మొదలైంది. చేతికి వచ్చిన కొత్త నోటుకు రూ.100 నోట్లు దొరకక ముప్పతిప్పలు పడ్డారు. తొలిరోజు తీసుకున్న డబ్బు కేవలం ‘సెల్ఫీ’లకే ఉపకరిస్తోందని పలువురు వాపోయారు. మరోపక్క శుక్రవారం నుంచి ఏటీఎం కేంద్రాలు సైతం పనిచేయనుండడంతో వాటి వద్దా బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది.

అందని రూ.500 నోట్లు
కేంద్ర ప్రకటించినట్లు గురువారం నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ మార్పిడి, డిపాజిట్ల  కార్యక్రమం మొదలైంది. అరుుతే, మార్కెట్‌లోకి కొత్త రూ.500 నోటు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో రూ.2000 నోట్లు మాత్రమే ప్రజలకు చేరారుు. గంటల తరబడి క్యూలో నిల్చున్న నగర వాసులకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పరిమితికి లోబడి గరిష్టంగా రూ.4000 చెల్లిస్తున్నారు. గతంలో అందుబాటులో ఉన్న దాని కంటే భారీ నోట్లు అమలులోకి రావడంతో రెండు రూ.2000 నోట్లు వీరి చేతికి వస్తున్నారుు. వీటిని తీసుకుని బయటకు వస్తున్న వినియోగదారులకు మరో పరేషాన్ ఎదురవుతోంది.

రూ.2000కు దొరకని చిల్లర
నగర వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచీ చిల్లర సమస్య ఏర్పడింది. పాత రూ.500, రూ.వెరుు్య నోట్లు పెట్రోల్ బంకులతో పాటు ‘ఎమర్జెన్సీ కేంద్రాలకు’ చేరిపోయారుు. దీంతో పాటు మిగిలిన చిన్న డినామినేషన్ నోట్ల కొరత ఏర్పడింది. ఈ పరిణామాలతో కొత్తగా చేతికి వచ్చిన రూ.2000 నోటుతో మార్కెట్‌లోకి వస్తున్న వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. రూ.వెరుు్య కంటే ఎక్కువ ఖరీదు చేస్తున్న వారికి ఇబ్బంది లేకపోరుునా.. అంతకు తక్కువ కొంటున్న వారికి మాత్రం చిల్లర లేక వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. ఇక బస్సులు, క్యాబ్‌ల్లో అరుుతే చిల్లర సమస్య కారణంగా అసలు రూ.2000 నోటు తీసుకోవడానికే నిరాకరిస్తున్నారు.

అంతటా అదే సీన్..
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో గంటల తరబడి వేచివుండి కొత్త నోట్లను చేతుల్లోకి తీసుకుంటున్న వినియోగదారులు వాటిని అపురూపంగా చూసుకుంటున్నారు. అనేక మంది వాటిలో ఉన్న ఫీచర్లను పరిశీలించడంపై ఆసక్తి చూపుతుండగా... మరికొందరు ఆ నోట్ల ఫొటోలు, సెల్ఫీలతో ముచ్చట తీర్చుకుంటున్నారు. గురువారం నగరంలో ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య కొత్త కరెన్సీనే ‘కరెంట్ డిస్‌ప్లే’గా మారింది. గురువారం ఉదయం నుంచీ కొత్త కరెన్సీ సెల్ఫీలతో ‘సోషల్ మీడియా’ నిండిపోరుుంది.

పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు...
రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు గురువారం మూడు కమిషనరేట్ల అధికారులు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. రద్దీ నేపథ్యంలో తొక్కిసలాటలు, ఇతర మోసాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం ఏటీఎం కేంద్రాలు సైతం పని ప్రారంభించనుండడంతో మరిన్ని చర్యలు తీసుకోవడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లోని సెంటర్ల వద్ద బలగాలను మోహరించనున్నారు. ఈ కేంద్రాలన్నీ రోడ్లపై ఉంటున్న నేపథ్యంలో అక్కడకు వచ్చే వినియోగదారులతో, వారి వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణరుుంచారు.

‘గుర్తింపు’పై వివరాలు రాయాల్సిందే..
పాత కరెన్సీ మార్పిడి, డిపాజిట్ చేయడానికి బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్తున్న వినియోగదారులు అక్కడ గుర్తింపుకార్డు ప్రతుల్ని సమర్పిస్తున్నారు. వీటిపై సెల్ నెంబర్‌తో పాటు ఏ రోజు దాఖలు చేస్తున్నారో ఆ తేదీ, సమయం, ఎంత మొత్తం డిపాజిట్‌కు ఇచ్చారో ఆ వివరాలు సైతం కచ్చితంగా రాయాలని, వాటి కింద సంతకం కూడా పెట్టాలని పోలీసుల సూచిస్తున్నారు. అలా కాకుండా మీ గుర్తింపుకార్డు ప్రతిని చేజిక్కించుకున్న ఇతరులు ఎవరైనా దాని జిరాక్సు ప్రతుల్ని తీసుకుని నగదు మార్పిడి చేసుకునే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల డబ్బు మార్పిడి, డిపాజిట్‌కు ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేస్తున్నారు.

హోటళ్లలో 40 శాతం తగ్గిన అమ్మకాలు
రాంగోపాల్‌పేట్: కేంద్ర సర్కారు పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్‌లోని అంతర్జాతీయ గుర్తింపు గల ప్యారడైజ్ హోటల్, అల్ఫా హోటల్‌తో పాటు పలు హోటళ్లలో అమ్మకాలు భారీగా తగ్గిపోయారుు. హోటళ్లలో రూ.1000, రూ.500 నోట్లు తీసుకోబోమని బోర్డులు ఏర్పాటు చేయడం, నెట్ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యాపారం పూర్తిగా పడిపోరుుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్యారడైజ్ హోటల్‌లో 40 శాతం వ్యాపారం తగ్గిపోరుునట్లు నిర్వాహకులు తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఆల్ఫా హోటల్‌లోనూ 30 శాతం అమ్మకాలు తగ్గిపోయారుు. దీంతో పాటు గురువారం వచ్చిన కొత్త రూ.2000 నోటుకు కూడా చిల్లర లభించక అన్ని వ్యాపార సంస్థలు వ్యాపారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. రైతుబజారులు పచ్చి కూరగాయల అమ్మకాలపై ఈ ప్రభావం అధికంగా పడింది. 

చిల్లర దొరక్క అవస్థలు
పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్తే రూ.2 వేల కొత్త నోటు ఇచ్చారు. దీనికి ఎక్కడా చిల్లర లేదంటున్నారు. పాత 500 నోట్లు కలిపి ఇస్తామని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త నోటుకు చిల్లర దొరికే పరిస్థితి లేదు. ఎక్కడకు వెళ్లినా ఇదే సమాధానం చెబుతున్నారు. పాత 100, 50 నోట్లతో పాటు కొత్త 500 నోట్లను త్వరగా వచ్చేతట్టు చేయాలి.   - రవికుమార్, షాపూర్‌నగర్

ఎక్కడా మారడం లేదు..
చిల్లర దొరకాలంటే గగనతరంగా మారింది. 4 వేల పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్తే రెండు రూ.2వేల నోట్లు ఇచ్చారు. వీటిని ఎక్కడ మార్చుకోవాలో అర్థం కావడం లేదు. కిరాణా దుకాణం, ఇతర మాల్స్‌లో కూడా చిల్లర తెమ్మంటున్నారు, సరుకులు ఇవ్వడం లేదు. బ్యాంకర్లు వంద రూపాయల నోట్లను కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.   - శ్రీదేవి, శ్రీసారుు కాలనీ

అనుమానిస్తున్నారు..
కొత్త నోట్లను కొన్ని ప్రాంతాల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే తీసుకునేందుకు భయపడుతున్నారు. అసలివా.. నకిలీవా అని ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పినా నమ్మడం లేదు. వెంటనే పంపిణీ సమస్య లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త నోట్లను త్వరితగతిన పంపిణి చేయాలి. కొత్త కరెన్సీ నోట్లు ఇచ్చినా వాటిని మార్చుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు.  - శంకర్, చింతల్

మరిన్ని వార్తలు