ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా?

8 Jun, 2016 03:56 IST|Sakshi
ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా?

కోదండరాంపై విమర్శలు సరికాదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై మం త్రులు విమర్శల దాడితో ఎగబడ్డారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా అని నిలదీశారు. మం గళవారం రేవంత్ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కోదండరాం రెండేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే స్పందించారన్నారు. రైతు సమస్యలపై ఆయన కోర్టుకు వెళ్లిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ‘‘ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు విమర్శిస్తారా?ఉద్యమకారుడికిచ్చే గౌరవమిదేనా? ఆంధ్రావాళ్లు కూడా ఆయన్ను ఇంతలా అవమానించలేదు. జేఏసీని కనుమరుగు చేయాలన్నదే టీఆర్‌ఎస్ వ్యూహం’’ అన్నారు.

>
మరిన్ని వార్తలు