ఆన్‌లైన్‌లో బస్‌పాస్ రెన్యువల్స్

3 Jun, 2016 20:53 IST|Sakshi

హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో బస్‌పాస్ రెన్యువల్స్‌ను ఇకపై ఆన్‌లైన్‌లోనే చేసుకొనే సదుపాయం  ఈ నెల 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. టీఆఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఇందుకోసం ప్రత్యేక ఆప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా బస్‌పాస్ కోసం దరఖాస్తు చేసుకొనేవారు మాత్రం బస్‌పాస్ కేంద్రాల వద్దకు వెళ్లవలసి ఉంటుంది. ఒకసారి బస్‌పాస్ తీసుకున్న వారు ఏడాదంతా ఆన్‌లైన్‌లోనే రెన్యువల్ దరఖాస్తు చేసుకోవచ్చు. అలా అందిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజుల్లో రెన్యువల్‌ కార్డులను వినియోగదారుల ఇళ్లకు చేరే విధంగా కొరియర్‌లో పంపిస్తారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని 5 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. నగరంలోని 50 కేంద్రాల ద్వారా బస్‌పాస్‌లను అందజేస్తున్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉంటోందని, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని.. దీనిని పరిష్కరించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తం ‘సాక్షి’తో చెప్పారు.

మరిన్ని వార్తలు