ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలే ఎక్కువ..!

21 Oct, 2023 02:25 IST|Sakshi

77.41 శాతం ఇవే నేరాలు

సోషల్‌ మీడియాకు సంబంధించినవి 12.02 శాతం 

ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌ (ఫ్యూచర్‌ క్రైం రీసెర్చ్‌ ఫౌండేషన్‌) నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అత్యాశ, అవగాహన లేమి కారణం ఏదైతే ఏంటి.. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలు గణనీయంగా పెరిగాయి. ఏసీ గదుల్లో కూర్చుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే సైబర్‌ నేరగాళ్లు పెరుగుతున్నారు.

జనవరి 2020 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు దేశవ్యాప్తంగా నమోదైన సైబర్‌ నేరాలపై ఫ్యూచర్‌ క్రైం రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సైబర్‌ నేరాల్లో ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలే 77.41 శాతం ఉన్నట్టుగా తేలింది. ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల్లో ప్రత్యేకించి యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) సంబంధిత మోసాలు 47.25 శాతం ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. నమోదైన సైబర్‌ నేరాలు కేటగిరీల వారీగా పరిశీలిస్తే..

మరిన్ని వార్తలు