పాస్ అడిగినందుకు మహిళా కండక్టర్‌పై దాడి

19 Nov, 2014 02:40 IST|Sakshi
పాస్ అడిగినందుకు మహిళా కండక్టర్‌పై దాడి

సుల్తాన్‌బజార్: బస్సులో ప్రయాణిస్తున్న హోంగార్డులను పాస్ అడిగినందుకు ఆర్టీసీ మహిళా కండక్టర్‌ను ముగ్గురు మహిళా హోంగార్డులు చితకబాదారు. బాధితురాలి కథన ం మేరకు.. శివరాంపల్లికి చెందిన రామాంజునమ్మ బండ్లగూడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి సత్యనగర్‌కు వెళుతున్న బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. ముగ్గురు మహిళ హోంగార్డులు నారాయణగూడ వద్ద బస్సు ఎక్కారు. అందులో ఒకరు టికెట్ తీసుకోగా మరొకరు పాస్ అని చెప్పారు. పాస్ చూపించమని కండక్టర్ అడగడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ముగ్గురు హోంగార్డులు నారాయణగూడ నుంచి బడీచౌడి పోలీసుస్టేషన్ వరకు కండక్టర్‌ను చితకబాదుతూ వచ్చారు. బడీచౌడిలో సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ వద్ద డ్రైవర్ శంకర్ బస్సును ఆపాడు. కండక్టర్ వేగంగా పోలీసుస్టేషన్‌లోకి వెళ్లింది. ఆమెను వెంబడించిన హోంగార్డులు సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ ఆవరణలో కూడా చితకబాదుతుండడంతో అక్కడి మహిళ పోలీసులు అడ్డుకున్నా అగకుండా చితకబాదారు. కార్యాలయంలో ఉన్న డీసీపీ రవిందర్ దీనిని గమనించారు. దాడి చేసిన అనంతరం హోంగార్డులు పరారయ్యారు. బాధితురాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే రాణి, అనసూయ మరో హోంగార్డులపై కేసు నమోదు చే సి దర్యాప్తు చేశారు.

మరిన్ని వార్తలు