కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవోకు జైలు, జరిమానా

21 Dec, 2014 01:43 IST|Sakshi

నరసరావుపేట ఆర్డీవో అరుణ్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే కాకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినందుకు గుంటూరు జిల్లా, నరసరావుపేట రెవిన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీవో) పి.అరుణ్‌బాబుకు ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కారం కింద వారం రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తీర్పు వెలువరిం చారు.

దీనిపై అప్పీల్‌కు వీలుగా ఆర్డీవో తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో ఎస్.నరసింహారావు అనే వ్యక్తి రెండెకరాల డీకేటీ పట్టా  భూమిని సాగు చేసుకుంటున్నారు. దీనిపై నడిచిన వ్యవహారంలో న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.

మరిన్ని వార్తలు