'చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు'

30 Apr, 2016 13:19 IST|Sakshi
'చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు'

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు ఎస్.శైలజానాథ్, తులసీరెడ్డి శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనవసరమని కేంద్రమంత్రి ప్రకటించినా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు.

ఓటుకు కోట్లు కేసు చంద్రబాబును బాబును భయపెడుతోందా అని వారు సందేహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.  కొడుకు లోకష్ను సీఎం చేసేందుకు ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ... ప్రతిపక్షాలనే లేకుండా చేయాలనుకుంటున్నారని వారు అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రేవేట్ నెంబర్ బిల్లును టీడీపీ వ్యతిరేకించిందని వారు  ఈ సందర్బంగా గుర్తు చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలంటూ ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబుకు వారు సూచించారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారో... తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారో లేదా సీఎంగా దిగిపోతారో చంద్రబాబే తేల్చుకోవాలని శైలజానాథ్, తులసీరెడ్డి స్పష్టం చేశారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా