సానియా సోదరి ఆనం నిఖా

12 Aug, 2015 10:44 IST|Sakshi
సానియా సోదరి ఆనం నిఖా

హైదరాబాద్ : టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఓ వైపు క్రీడా శాఖ.. రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారానికి సానియా పేరును అవార్డుల కమిటీకి సిరఫాసు చేసింది. మరోవైపు సానియా చెల్లెలు ఆనం మీర్జా పెళ్లి ఖరారైంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అక్బర్‌ రషీద్‌తో... సెప్టెంబర్‌ 16న ఆనం మీర్జా నిఖా జరగనుంది. దీంతో సానియా ఇంటి పెళ్లి సందడి నెలకొంది. వధువు ఆనం మీర్జా షాపింగ్‌ కోసం ఇప్పటికే ముంబై వెళ్లింది.  ఇరు కుటుంబాలు ఇప్పటికే పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.  ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా, అబూ సందీప్‌... ఆనం మీర్జా వెడ్డింగ్‌ డ్రెస్‌ను సెలక్ట్‌ చేయనున్నారు. ఆనం మిర్జా హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు