దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో 2వ ఛార్జిషీట్

17 Sep, 2014 16:06 IST|Sakshi
భత్కల్, తహసీన్‌ అక్తర్‌, వఖాస్

హైదరాబాద్:దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రెండవ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2013  ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో పలువురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు ప్రధాన సూత్రధారులు ఇండియన్‌ ముజాహిదిన్‌ ఉగ్రవాదాలుగా ఎన్ఐఏ పేర్కొంది. ఇండియన్‌ ముజాహిద్దీన్‌ నేతలు  భత్కల్, వఖాస్, తహసీన్‌ అక్తర్‌లను ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ చేర్చింది.

 ఇండో-నేపాల్‌ సరిహద్దులో భత్కల్‌ను, ఢిల్లీ పోలీసులు తహసీన్‌ అక్తర్‌ను,  జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్‌ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్‌సుఖ్‌నగర్‌  బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్  నిందితుడు.
**
 
 

మరిన్ని వార్తలు