పాతబస్తీలో ఎన్‌ఐఏ సోదాలు.. ఇద్దరు అరెస్ట్‌?

16 Sep, 2023 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేపట్టారు అధికారులు. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అటు తమిళనాడులో కూడా ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. 

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, నగరంలో వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఐసిస్ సానుభూతి పరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు సహా హైదరాబాద్‌లోని పాతబస్తీ, మలక్‌పేట, టోలీచౌకీ సహా మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. 2022లో కోయంబత్తూర్‌ కార్‌ బ్లాస్ట్‌కు సంబంధించి ఎన్‌ఐఏ దాడులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసులో నటుడు నవదీప్‌ పేరు

మరిన్ని వార్తలు