ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్: సీఐడీ

28 Jul, 2016 11:55 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రంను ప్రింటింగ్ ప్రెస్ నుంచి షేక్ నిషాద్ లీక్ చేశాడని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబైలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషాద్ లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధంతో ఉందని అనుమానిస్తున్న రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు.

ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రూ. 50 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.75 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దని పరీక్ష రాసిన విద్యార్థులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు