సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో సాప్ట్ స్కిల్స్‌లో శిక్షణ

4 Aug, 2016 04:37 IST|Sakshi
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో సాప్ట్ స్కిల్స్‌లో శిక్షణ

క్ష్యం ఏదైనా.. ఎలాంటిదైనా.. దానిని సాధించడంలో ఆత్మవిశ్వాసమే కీలకం. అలాంటి నిండైన ఆత్మవిశ్వాసాన్ని, చక్కని కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పెం పొందించే ‘సాఫ్ట్‌స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ కోర్సును ‘సాక్షి ఎడ్జ్’ అందిస్తోంది. ఈ కోర్సులో వెర్బల్-నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, మిర్రర్ ఇన్ ది మైండ్-స్ట్రెంత్ మరియు వీక్‌నెసెస్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, గ్రూప్ డిస్కషన్ తదితర అంశాలపై ఉత్తమ శిక్షణ ఇస్తారు.

వినూత్నమైన టీచింగ్ మెథడాలజీ, ముఖాముఖి ఇంటరాక్టికల్ సెషన్లతో ప్రతి అంశాన్నీ సులభంగా నేర్చుకునే అవకాశం. ఆగస్టు 17 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. కోర్సు వ్యవధి 30 రోజులు. ఫీజు రూ.5,750. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న సాక్షి జర్నలిజం స్కూల్‌లో ఈ శిక్షణ ఉంటుంది. పరిమిత సంఖ్యలో ఉన్న సీట్లకు రిజిస్ట్రేషన్లు ప్రారంభయ్యాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.1లో ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాల కోసం 9603533300 నంబర్‌లో సంప్రదించవచ్చు.
 

మరిన్ని వార్తలు