విజ్ఞానం పేరుతో విధ్వంసం

11 Jun, 2017 00:48 IST|Sakshi
విజ్ఞానం పేరుతో విధ్వంసం
స్పీకర్‌ మధుసూదనాచారి
 
సాక్షి, హైదరాబాద్‌: విజ్ఞానం పేరుతో విధ్వంసం జరుగుతోందని, ప్లాస్టిక్‌ బియ్యం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని శాసనసభా స్పీకర్‌ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని తన చాంబర్లో కాకతీయ వర్సిటీ పరిశోధనా విద్యార్థులు రూపొందించిన ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ‘సమూలంగా ఒక జాతిని ఏ జీవీ చంపదని.. ప్లాస్టిక్‌ బియ్యం తింటే మానవ జాతి మనుగడ ఉంటుందా? సమాజం ఎటు పోతోందని ప్రశ్నించారు.

నా జీవితంలో ఇద్దరు కాల జ్ఞానులను చూశానని, ఒకరు జయశంకర్‌ కాగా, రెండో వ్యక్తి సీఎం కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాలని 2000 సంవత్సరంలొనే అనుకున్నాం. ఏం జరుగుతుందో ఆనాడే కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఒక వైవిధ్యమైన ఉద్యమం’అని స్పీకర్‌ పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని తెచ్చిన ప్రొ.భాస్కర్‌ను ఆయన అభినందించారు.  
మరిన్ని వార్తలు