తాగునీటికి సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌

6 Mar, 2017 04:06 IST|Sakshi
తాగునీటికి సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌

రూ.156.29 కోట్లతో ప్రణాళిక రూపొందించిన ఆర్‌డబ్ల్యూఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేసింది. జిల్లాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా తాగునీటి సరఫరా నిమిత్తం రూ.156.29కోట్లు అవసరమని అంచనా వేసింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాలకు సమీపంలోని తాగునీటి వనరుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తాగునీటి ఎద్దడి అధికంగా ఉన్న 138 గ్రామాలకు ఈ నెల 1 నుంచి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 58, వనపర్తి జిల్లాలో 32, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 31, నల్లగొండలో 11 గ్రామాల్లో తాగు నీటి ఇబ్బందులున్నట్లు గుర్తించారు. భవిష్యత్తు లో ఎండలు ముదిరే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల్లో తాగునీటి సమస్యను అధిగమించే విధం గా సీఆర్‌ఎఫ్‌ (కెలామిటీ రిలీఫ్‌ ఫండ్‌) నుంచి నిధులను సమకూర్చారు.

మరిన్ని వార్తలు