లాభాల బాటలో తెలంగాణ ఆర్టీసీ: మంత్రి

30 Aug, 2019 20:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జేటీసీలు, డీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ఆదాయం, రోడ్డు భద్రతపై జిల్లాల వారీగా మంత్రి సమీక్షించారు. ఆర్టీసీతో సమన్వయం, ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులకు మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తోందన్నారు. అందుకోసం అధికారులు సహకరించాలని మంత్రి కోరారు. రోడ్డు భద్రతపై మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. సిరిసిల్లలో డ్రైవర్ల కోసం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలని మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు.

>
మరిన్ని వార్తలు