యాదాద్రి మెట్రోపై హెచ్‌ఎంఆర్ బృందం అధ్యయనం

6 Jan, 2016 19:16 IST|Sakshi

యాదాద్రికి రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోన్న నేపథ్యంలో... నగర శివార్లలోని ఉప్పల్ నుంచి యాదాద్రికి 52 కిలోమీటర్ల మేర మెట్రోరైలు మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమార్గంలో బుధవారం హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్‌రెడ్డితోపాటు, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇతర నిపుణుల బృందం పర్యటించింది.

భువనగిరి, రాయగిరి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించింది. ఆకాశమార్గం (ఎలివేటెడ్) మార్గంలో మెట్రో మార్గమా లేక ఎంఎంటీఎస్ రెండోదశను సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి పొడిగించాలా అన్న అంశంపై దృష్టి సారించింది. సమగ్ర అధ్యయనం జరిపి ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి 'సాక్షి'కి తెలిపారు.

మరిన్ని వార్తలు