టుడే న్యూస్ డైరీ

3 Feb, 2016 07:47 IST|Sakshi

ఏపీ కేబినెట్ భేటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు(బుధవారం) విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిలో జరిగిన ఘటనలపై మంత్రివర్గం చర్చించనుంది. శుక్రవారం నుంచి కాపు నేత ముద్రగడ ఆమరణ నిరాహారదీక్షకు దిగనున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

తాత్కాలిక సచివాలయం: ఏపీ సర్కార్ విజయవాడలో నిర్మించతలపెట్టిన తాత్కాలిక సచివాలయం పనుల కాంట్రాక్టులకు సంబంధించి బిడ్డింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది.  

'రత్నాచల్' రద్దు: విశాఖ- విజయవాడ మధ్య నడిచే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును రెండు రోజులపాటు(బుధ, గురువారాల్లో) రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఢిల్లీకి కేటీఆర్: స్వచ్ఛ భారత్ మిషన్ పై ఏర్పాటుచేసిన కార్యక్రమంతోపాటు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

మేడారానికి మంత్రులు: కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సమ్మక్క- సారక్క జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకుగానూ ముగ్గురు మంత్రులు నేడు మేడారం వెళ్ల నున్నారు. డిప్యూటీ సీఎం కడియం, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్.. అక్కడి అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ ఆందోళనలు: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలపై ఎంఐఎం దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలు నేడుకూడా కొనసాగనున్నాయి. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో నేడు బంద్ తలపెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.   

'అరుణాచల్' పై విచారణ: అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు అంశంలో దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో నేడు కూడా విచారణ జరగనుంది.

>
మరిన్ని వార్తలు