-

Constitution Day: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

26 Nov, 2023 11:43 IST|Sakshi

నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతియేటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 న జరుపుకుంటారు. 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగ సభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల పౌరులలో గౌరవ భావాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం అనేది ప్రారంభమైంది. సామాజిక న్యాయం, సాధికారతను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తయింది. మన దేశ రాజ్యాంగం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. 

రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అనేక దేశాల నియమాలను చేర్చారు. అమెరికా, ఐర్లాండ్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల రాజ్యాంగాల సహాయం తీసుకున్నారు. ఈ దేశాల రాజ్యాంగాల నుండి, పౌరుల విధులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పాత్ర, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన

మరిన్ని వార్తలు