టాప్ ఐఐటీల్లో 10 శాతం అదనపు సీట్లకు నో!

20 Oct, 2016 02:34 IST|Sakshi

హెచ్‌ఆర్డీకి తేల్చి చెప్పిన ఐఐటీల డెరైక్టర్లు

 సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో 10% సీట్లు అదనంగా పెంచాలన్న ఐఐటీల కౌన్సిల్ నిర్ణయాన్ని 7 టాప్ ఐఐటీలు తిరస్కరించాయి. విదేశీ విద్యార్థుల కోసం తాము అదనపు సీట్లు పెంచబోమని స్పష్టం చేశాయి. సీట్ల పెంపుపై ఆగస్టులో ఐఐటీల కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల మం త్రిత్వ శాఖ ఐఐటీల డెరైక్టర్లను కోరింది. దీనిపై బుధవారం 7 ఐఐటీల డెరైక్టర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

సీట్ల పెంపునకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొందని, ఫ్యాకల్టీ కొరత ఉన్న నేపథ్యం లో సీట్లను పెంచబోమని వారు స్పష్టం చేశారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సులో సీట్ల పెంపును ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువాహటి, ఖరగ్‌పూర్, ఖాన్‌పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీలు వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని స్ప ష్టం చేశాయి. ఐఐటీ హైదరాబాద్, మండి, పాట్నా, రో పర్, జమ్ము ఐఐటీలు మా త్రం సీట్లు పెం చేందుకు అంగీకరించాయి. ఐఐటీ హైదరాబాద్‌లో 40 సీట్లు, మండిలో 50, పాట్నా లో 25, రోపర్‌లో 105, జమ్ము ఐఐటీలో 30 సీట్లు పెంచుతామని తెలియజేశాయి.

మరిన్ని వార్తలు