ఏపీ, తెలంగాణలలో 17 రైళ్లు రద్దు

24 Sep, 2016 12:32 IST|Sakshi
ఏపీ, తెలంగాణలలో 17 రైళ్లు రద్దు

హైదరాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-విజయవాడల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. శనివారం దక్షిణ మధ్య రైల్వే 17 రైళ్లను రద్దు చేయగా, మరో 24 రైళ్లను దారిమళ్లించింది.  
 
రద్దయిన సర్వీసులు

గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్ప్రెస్, గుంటూరు- మాచర్ల ప్యాసింజర్, మాచర్ల-భీమవరం ప్యాసింజర్, రేపల్లి-సికింద్రాబాద్ ప్యాసింజర్, నడికుడి-మాచర్ల ప్యాసింజర్, సికింద్రాబాద్-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, పిడుగురాళ్ల-మిర్యాలగూడ ప్యాసింజర్, మాచర్ల-నడికుడి ప్యాసింజర్, సికింద్రాబాద్-రేపల్లి ప్యాసింజర్, మాచర్ల-గుంటూరు ప్యాసింజర్, మిర్యాలగూడ-పిడుగురాళ్ల ప్యాసింజర్, సికింద్రాబాద్-రేపల్లి ప్యాసింజర్

దారి మళ్లించినవి

కమాఖ్య-యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా ఎక్స్ప్రెస్, తిరువనంతపురం-హైదరాబాద్ శబరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్,  సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్, తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్ప్రెస్, హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయాణాద్రి ఎక్స్ప్రెస్

మరిన్ని వార్తలు