బస్సు లోయలో పడి 17 మంది మృతి

21 Jun, 2015 04:44 IST|Sakshi
బస్సు లోయలో పడి 17 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందగా 22 మంది గాయపడ్డారు. 40 మంది ప్రయాణికులతో పిథోరాగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ బస్సు ధ్యారీ వద్ద వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించామని కుమాన్ డీజీపీ పుష్కర్ సాయిలాల్ తెలిపారు.

ప్రమాదంపై ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

మరిన్ని వార్తలు