ఉగ్ర సంబంధాలు : 18,632 మంది ఉద్యోగుల తొలగింపు

8 Jul, 2018 16:12 IST|Sakshi

అంకారా : ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో దాదాపు 18, 632 మంది ఉద్యోగులను(పోలీసు అధికారులు, సైనికులు) టర్కీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు ఓ అత్యవసర సర్క్యూలర్‌ను ఆదివారం టర్కీ ప్రభుత్వం జారీ చేసింది.

రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మిలటరీ కుట్రలో ఈ ఉద్యోగులు పాల్గొన్నారు. 8,998 మంది పోలీసు అధికారులు, 3,077 సైనికులు, 1,126 నావల్‌ అధికారులు, 1,052 సివిల్‌ సర్వెంట్లు, 199 అకాడమీషియన్లు ఇందులో ఉన్నారు.

కుట్రతో సంబంధం ఉన్న మూడు న్యూస్‌ పేపర్లను, టెలివిజన​ చానెల్‌ను, 12 అసోసియేషన్లను కూడా టర్కీ ప్రభుత్వం మూసేసింది. కొద్దిరోజుల క్రితం మరోమారు మిలటరీ కుట్రను తిప్పికొట్టింది. ఇప్పటికే కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని ఈ నెల 19 వరకూ పొడిగించారు.

మరిన్ని వార్తలు