వైమానిక దాడుల్లో 31 మంది మృతి

17 Oct, 2016 11:02 IST|Sakshi
వైమానిక దాడుల్లో 31 మంది మృతి

డమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందినట్టు బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై నాలుగు వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది. శిథిలాల్లో 10 కుటుంబాలు చిక్కుపోయాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాల హస్తం ఉండొచ్చ అనుమానాన్ని వ్యక్తం చేసింది.

ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

మరిన్ని వార్తలు